తండ్రికి కూతురు లిటిల్ ప్రినెస్స్.. కూతురికి నాన్న సూపర్ హీరో.. పురుషుడు కూతురే పుట్టాలని ఎందుకు కోరుకుంటాడంటే..
నాన్నకు పిల్లలు అందరూ ఒక్కటే.. అయితే కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. అవును తండ్రి కూతుర్ల ప్రేమ గురించి వారి బంధం అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. తండ్రికి తన కూతురే పంచ ప్రాణాలు.. ఆ కూతురికి నాన్నే ఇలలో నడిచే దైవం. దాదాపు అందరూ తండ్రులు తమ కొడుకుల కంటే కూతుళ్ళనే ఎక్కువ ప్రేమిస్తారు. తన తల్లిని కుతుర్లో చూసుకుంటారు. కూతురి ప్రేమ తండ్రికి అమూల్యమైన నిధి. ఎక్కువ మంది తండ్రులు తమకు కూతుర్లే పుట్టాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా...
కూతురు పెరగడానికి ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం తండ్రి ఉన్న చోటు అని చెప్పవచ్చు. ఒక తండ్రికి తన కూతురిపై ఉన్న ప్రేమ అంతులేనిది. ప్రతి పురుషుడు ఆడపిల్ల కావాలని కోరుకుంటాడు. ఆడపిల్ల పుట్టాలని దేవుడికి మొక్కకునే పురుషులు కూడా ఉన్నారు. అన్నింటికంటే నాన్న కూతుర్నే ఎందుకు అంతగా ఇష్టపడతాడో మీకు తెలుసా?
ఒక తండ్రికి తన కూతురితో ఉన్న సంబంధం భావోద్వేగపరంగా అత్యంత సన్నిహితంగా ఉంటుంది. తండ్రి తన కూతురిని రాజకుమారిగా భావిస్తాడు. అందుకే ప్రతి తండ్రి తన కూతురిని ఎక్కువగా ప్రేమిస్తాడు. అందమైన తండ్రీకూతుళ్ల సంబంధాన్ని చూసి.. కొడుకులు ఈర్శపడే సందర్భాలు కూడా ఉంటాయి. చాలా మంది నాన్నలు తమ కూతురిని లిటిల్ ప్రిన్సెస్‌గా భావించి తన శక్తికి మించి కోరుకున్నవన్నీ సమకురుస్తాడు.
నాన్న తన కూతురిలో తల్లి ప్రేమను చూస్తాడు. అతను తన కూతురిని తన రెండవ తల్లిగా భావిస్తాడు. కుటుంబ బాధ్యత నిర్వహణ ఏ తప్పు చేసినా.. అతని భార్యతో సహా అందరూ కోపంగా ఉండవచ్చు. అయితే కూతురు మాత్రం ఎప్పుడూ తన తండ్రి మీద కోపం తెచ్చుకోదు. ఆమె తన తండ్రి తప్పులను త్వరగా క్షమించింది. ఈ కారణంగా.. పురుషులు తమకు కుమార్తె పుట్టాలని కోరుకుంటారు.
తమ కూతుళ్లు తమ ప్రాణాల కంటే ఎక్కువగా తండ్రులను ప్రేమించడం, బాధ్యతగా చూసుకోవడం చూసి ఉంటారు. ఒక కూతురు తన తండ్రి పట్ల చూపించే కేరింగ్ చాలా మంది హృదయాలను గెలుచుకుంటుంది. పురుషులు ఆడపిల్లలను కనాలని కోరుకోవడానికి ఇది కూడా ఒక కారణం.
తండ్రి కూతుళ్ల మధ్య బంధం చాలా దగ్గరిది. ఒక తండ్రి ఏదైనా విషయంలో బాధపడితే తల్లిలాగా అతన్ని ఓదార్చగల ఏకైక వ్యక్తి ఒక కూతురు. కూతురు తన తండ్రికి కలిగే చిన్న బాధను కూడా తట్టుకోదు. అందుకే కూతురు ఇచ్చే అన్ కండిషనల్ లవ్ ని అంటే.. ఏమీ ఆశించకుండా తండ్రిని ప్రేమించే గుణం ఉన్న కూతురు అంటే నాన్నకు అత్యంత ఇష్టం. అందుకే కూతురు పుట్టాలని కోరుకుంటాడు.
కూతుళ్లకు తండ్రి సూపర్ హీరో.. తన కూతురు సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే తండ్రికి .. కూతురికి వచ్చే చిన్న కష్టాన్ని, చిన్న బాధను కూడా భరించలేడు. అదే విధంగా తండ్రికి ఏ చిన్న కష్టం బాధ తన తల్లి వలన కలిగినా కూతురు తట్టుకోలేదు.. అందుకనే తల్లి తండ్రిని తిడితే.. వెంటనే తండ్రికి సపోర్ట్ గా కూతురు నిలబడుతుంది. ఒక తండ్రి తన కూతురిని ఎలా చూసుకుంటాడో.. అలాగే కూతురు తన తండ్రిని అందరికంటే ఎక్కువగా చూసుకుంటుంది. అందుకే పురుషులు ఆడపిల్లను కనడానికి ఇష్టపడతారు.
మొత్తం మీద, ఒక కూతురు తన తండ్రి పట్ల చూపించే అపారమైన ప్రేమ, తండ్రి పట్ల ఆమెకున్న కరుణ, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తండ్రికి మద్దతుగా నిలబడే గుణం ఇవన్నీ ప్రతి పురుషుడు.. తనకు కూతురు పుట్టాలని కొరుకోవడానికి కారణాలు కావచ్చు.