నేటి కాలంలో సంబంధాన్ని కాపాడుకోవడం లేదా కాలక్రమేణా దాని బలాన్ని పెంచుకోవడం చాలా కష్టంగా మారింది. ఇంతకుముందు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం మూడో వ్యక్తి... కానీ నేటి కాలంలో ఫోన్‌లు, సోషల్ మీడియా కూడా సంబంధాలకు పెను ముప్పుగా మారాయి. అయితే.. మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం తప్పనిసరి అయితే.. అతిగా ఉపయోగించడం వల్ల సంబంధాలలో చీలిక ఏర్పడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయన్న సత్యాన్ని కాదనలేము. ముఖ్యమైన సమాచారం నుంచి వినోదం వరకు, ప్రతిదీ కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుంది.. దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేసేలా ఈ ఫోన్ పనిచేస్తుంది.. అలాగే.. దగ్గరగా ఉన్న మనుషులను దూరంగా చేస్తుందని పేర్కొంటున్నారు మానసిక నిపుణులు.. సాంకేతికతను కొంత జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే, అది సంబంధాలను మరింత మెరుగ్గా, దృఢంగా మార్చుకోవడంలో సహాయకరంగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఫోన్లు భార్యభర్తలు, రిలేషన్ సంబంధాలను ఎలా బలహీనపరుస్తాయి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..