Relationship Tips: ప్రస్తుత కాలంలో సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ముఖ్యంగా బంధంలో ఇద్దరిలో సఖ్యత లేకపోవడం, నమ్మకం కోల్పోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో ఏదైనా సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టంగా మారుతుంది. రిలేషన్‌షిప్‌లో వివాదాలు, చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం.. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో తరచుగా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం మారడం పెద్ద గొడవకు దారితీయడంతోపాటు బంధం తెగిపోయే వరకు వెళ్తుంది.
ఏదైనా సంబంధం దూరం కాకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య సఖ్యత, నమ్మకం, అర్ధం చేసుకోవడం, ప్రేమ ముఖ్యం.. మనస్పర్థలు లేదా వివాదం సమయంలో మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, అది గొడవగా మారకుండా నిరోధించడం చాలా ముఖ్యం. ఇలాంటి సంఘర్షణ సమయంలో ఆరోగ్యకరమైన వాదన కోసం.. కొన్ని చిట్కాలను అనుసరించడం ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు.. ఇలాంటి సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి..
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి: మనం అర్థం చేసుకునే విధానం వల్ల చాలా గొడవలు సద్దుమణుగుతాయి. ప్రతిస్పందించడానికి బదులుగా, మనం అర్థం చేసుకోవడానికి వినాలి. అవతలి వ్యక్తి ఏమి చెప్పాలనుకుంటున్నాడో దాని గురించి మరింత స్పష్టతగా విని అప్పుడు స్పందించాలి.
అంగీకారం.. ఏకీభవించడం: మీరు సంబంధంలో మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నప్పుడు, ముందుగా మీరు అవతలి వ్యక్తితో ఏకీభవించే సాధారణ అంశాలపై దృష్టి పెట్టండి. ఆ తర్వాత మెల్లగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల వైపు వెళ్లి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి.
వాస్తవికతకు చోటు కల్పించండి: ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, ఎదుటివారి అభిప్రాయాన్ని వినడం లేదా అంగీకరించడం కంటే.. మీ అభిప్రాయాన్ని వారి
పెద్ద సమస్యలపై దృష్టి పెట్టండి: తరచుగా, తగాదా లేదా వాదించేటప్పుడు.. ఘర్షణ పడటం ప్రారంభిస్తారు. కాబట్టి చిన్న సమస్యలను విస్మరించడానికి ప్రయత్నించండి. పెద్ద తీవ్రమైన సమస్యలపై దృష్టి సారిస్తూ భవిష్యత్తు అవకాశాలపై దృష్టి పెట్టండి.
సమయానికి చర్చను ముగించండి: ఒక వాదన లేదా వాదం పెరిగి ఘర్షణగా మారినప్పుడు, ఆ వాదనను ఎప్పుడు ముగించాలి. మీ శక్తిని ఎప్పుడు ప్రదర్శించి.. ఎప్పుడు ముగించాలి అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి.