
వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎటునుంచి ఏ సమస్య వస్తుందో చెప్పలేం. వాతావరణంలోని వేడి, ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే చెమట కారణంగా ప్రైవేట్ పార్ట్స్‌లో దురద, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇలాంటి ప్రైవేట్ పార్ట్స్‌లో సమస్యల గురించి మహిళలు ఇతరులతో చర్చించడానికి అస్సలు ఇష్ట పడరు. యోనిలో దురద, మంట, పొడిబారడం వంటి సమస్యలకు కారణం.. నీటిని సరిగ్గా తాగకపోవడమే. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే.. నీటిని ఎక్కువగా తాగడం మొదలు పెట్టండి.

చెమట వల్ల యోని ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈస్ట్, బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఇంట్లో ఉండే సమయంలో గాలి తగిలే విధంగా చూసుకోవాలి.

యోని శుభ్రత విషయంలో కూడా పలు జాగ్రత్తలు పాటించాలి. యోని ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అవసరం అయితే.. అప్పుడప్పుడు టిష్యూ, కాటన్ క్లాత్‌తో తుడవాలి. ఇలా చేస్తే.. దురద రాకుండా ఉంటుంది.

ఎప్పటికప్పుడు ఇన్నర్ వేర్స్‌ని మారుస్తూ ఉండాలి. లేదంటే అక్కడ అనారోగ్యకరమైన బ్యాక్టీరియా పేరుకుపోయి.. పలు రకాల చర్మ సమస్యలు తలెత్తవచ్చు. వీలైనంత వరకూ కాటన్ దుస్తులు ధరించాలి.