
పాయసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ తీపి వంటకం. ఎందుకంటే, దీనిని ప్రతి పండుగకి చేసుకుని తింటారు. చాలా మంది బియ్యం, అటుకులతో తయారు చేస్తారు. కానీ వాటి కన్నా కొద్దీ మినుషాల్లోనే తయారయ్యే రవ్వ పాయసం. ఇలా చేస్తే పెద్దల నుంచి పళ్ళు లేని వాళ్ళ వరకు ఇష్టంగా తినే తీపి వంటకం. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

రవ్వ పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక లీటర్ పాలు , ఇంకా కొద్దిగా చక్కెర లేదా బెల్లం పొడి, – ¾ కప్పు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పు , 10 కిస్మిస్ లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , రెండు కప్పుల నీరును తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అద్భుతం.

రవ్వ పాయసం తయారీ విధానం : ముందుగా రవ్వను వేయించుకోవాలి. ఒక పాన్ లో టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి అది బాగా వేడయ్యాక దానిలో రవ్వ వేసి మీడియం మంటపై గోల్డ్ రంగు వచ్చేవరకు దీనిని వేయించాలి. అప్పుడే తినేటప్పుడు మంచిగా ఉంటుంది లేదంటే రవ్వ రవ్వగానే ఉంటుంది.

పాయసం ఉడికించడం : ఇప్పుడు మరో పాత్రలో కొద్దిగా నీరు, పాలు పోసి వీటిని బాగా మరిగించాలి. ఇవి మరిగిన తర్వాత ముందుగా వేయించిన రవ్వను వేసి దీనిని కలుపుతూ ఉండాలి. గరిటె తీసుకుని దీనిని గడ్డలు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా అయితే అది ఉప్మా లాగా అవుతుంది.

తీపి కలపడం: ఈ రవ్వ మిశ్రమం ఉడికిన తర్వాత దీనిలో బెల్లం పొడి వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. అలాగే, ఇంకో 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ను చిన్న పాన్‌లో నెయ్యి తో జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఈ రవ్వ పాయసంలో కలపాలి. ఇంకా దించే ముందు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి.