Ayodhya: వందల ఏళ్ల నాటి కల సాకారం.. .అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Updated on: Jan 22, 2024 | 4:13 PM

ఇక రామ్‌లలా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మంగళ ధ్వనితో నిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 50మంది ప్రముఖ కళాకారులు భాగస్వాములయ్యారు. అయోధ్య నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

1 / 8
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ.. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

2 / 8
సుమారు 500 ఏళ్ల తర్వాత భవ్య మందిరంలో..దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరాడు. ఆ మహోన్నత క్షణాలను వీక్షించిన భక్తజనం జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తించారు.

3 / 8
రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరించారు. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

4 / 8
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రాణప్రతిష్ఠ సమయంలో అయోధ్య గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.

5 / 8
ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు రామయ్యకు ప్రత్యేక వస్త్రాలతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామయ్యకు ప్రత్యేక వస్త్రాలను సమర్పించారు.

6 / 8
ఇక రామ్‌లలా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మంగళ ధ్వనితో నిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 50మంది ప్రముఖ కళాకారులు భాగస్వాములయ్యారు.

7 / 8
అయోధ్య నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

8 / 8
ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.