Hyderabad: స్వాభిమాన్ యాత్ర పేరుతో సరికొత్త ఈవెంట్.. పాల్గొన్న యువకులు..

|

Feb 12, 2024 | 10:56 AM

హైదరాబాద్‌లోని LGBTQIA కమ్యూనిటీకి చెందిన 600 మందికి పైగా సభ్యులు మూడు సంవత్సరాల తర్వాత క్వీర్ స్వాభిమాన యాత్ర అని పిలవబడే ప్రైడ్ మార్చ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా రద్దయిన ఈ వేడుక తిరిగి మూడేళ్ళ తర్వాత ప్రారంభించారు. చాలా సంవత్సరాల తరువాత సన్నిహిత మిత్రులను కలుసుకుని అందరం ఒకరినొకరు పలకరించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

1 / 5
హైదరాబాద్‌లోని LGBTQIA కమ్యూనిటీకి చెందిన 600 మందికి పైగా సభ్యులు మూడు సంవత్సరాల తర్వాత క్వీర్ స్వాభిమాన యాత్ర అని పిలవబడే ప్రైడ్ మార్చ్‌లో పాల్గొన్నారు.

2 / 5
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ధర్నా చౌక్ , ఇందిరా పార్క్ మధ్య సాగిన ఈ యాత్రలో డోల్ , సంగీతం, నృత్యం, ప్లకార్డుల ప్రదర్శనతో పాటు అనేక నినాదాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

3 / 5
క్వీర్ స్వాభిమాన యాత్ర ఆదివారం మధ్యాహ్నం వివిధ రంగాలకు చెందిన 600 మందితో విజయవంతంగా సాగింది. ఇందులో అన్ని కమ్యూనిటీలకు, కళలకు చెందిన వారు ఒక్కటయ్యారు.

4 / 5
మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపుగా ప్రారంభమైన ఈ మార్చ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరగా ఇందిరా పార్క్‌లో ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు.

5 / 5
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇందులో పాల్గొన్న యువత కోరారు. పాత స్నేహితులను కలుసుకోవడానికి, సమాజం నుండి ప్రేమను స్వీకరించడానికి ఈ ఈవెంట్ సరైన అవకాశం అని ఇందులో పాల్గొన్న సభ్యులు తెలిపారు.