2 / 5
ప్రజంట్ హైదరాబాద్ నుంచి విజయవాడ, వెజాగ్ వెళ్లేందుకు వరంగల్, ఖమ్మం మీదుగా ఒక రూట్... నల్గొండ, గుంటూరు మీదుగా మరో రూట్ ఉన్నాయి. ఈ రెండూ కూడా చాలా బిజీ మార్గాలు. వరంగల్ మార్గం గరిష్ఠ సామర్థ్యం 150 కిలోమీటర్లు. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ హైస్పీడ్ కారిడార్లలో గంటకు గరిష్ఠంగా 220 కిమీ వేగంతో వెళ్లేలా కొత్త లైన్లను నిర్మించాలన్నది రైల్వేశాఖ ప్రతిపాదన.