Ganesh Chaturthi 2024: దేశంలోని ఈ 3 గణేశుడి ఆలయాలను దర్శిస్తే మీ కోరికలు 100శాతం నెరవేరుతాయి..!

Updated on: Sep 09, 2024 | 5:33 PM

వినాయక చవితి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశోత్సవం అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు గణేశ ఉత్సవాలు జరగనున్నాయి. అటువంటి శుభ సందర్భంగా భారతదేశంలోని మూడు అద్భుతమైన గణపతి దేవాలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
Ganesh Idols

Ganesh Idols

2 / 5
దేశంలోని ఈ మూడు ఆలయాలు ప్రత్యేకించి గణపతి దేవాలయాలుగా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లి పూజలు చేసిన ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భారతదేశంలోని ఈ మూడు దేవాలయాలు మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి.

3 / 5
సిద్ధివినాయక దేవాలయం: ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ గణపతి మందిరం భారతదేశంలోని గణేష్ అత్యంత ప్రసిద్ధ ఆలయం. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి. సిద్ధివినాయక దేవాలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన ఆలయ ట్రస్ట్‌లో ఒకటి. గణేష్ చతుర్థి సమయంలో తప్పక సందర్శించవలసిన దేవాలయం ఇది.

4 / 5
ఖజ్రా గణేశ దేవాలయం : ఖజ్రాన్ గణేశ దేవాలయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంది. ఈ ఆలయం వేలాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఏడాది పొడవునా ఇక్కడకు భక్తులు పోటెత్తుతారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వినాయకుని ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయి.

5 / 5
మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం: గణేశుడు కొలువై ఉన్న మరో ఆలయం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది.  జైపూర్‌లోని మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1761 లో నిర్మించినట్లు చెబుతారు. కోటలు, కొండల మధ్య నిర్మించబడిన ఈ ఆలయం జైపూర్‌లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శివరాత్రి నాడు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. ఇది జైపూర్ సిటీకి 6 కి.మీటర్ల దూరంలో ఉంది. మోతీ డుంగ్రీ దేవాలయం దేశంలోనే అత్యంత అందమైన, పురాతనమైన గణేశ దేవాలయం. ఇక్కడ గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని బలంగా నమ్ముతారు.