ఉలవలతో ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఆ పవరే వేరు..!

|

Jan 14, 2025 | 11:41 AM

ఉలవలు.. దాదాపు అందరికీ తెలుసు.. గ్రామీణ నేపథ్యం కలిగి వారికి మరింత ఎక్కువగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఉలవలతో చాలా రకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. ఉలవలను గుగ్గిళ్లుగా చేసుకుంటాం. చారు కాసుకుంటాము. కొందరు వడలు కూడా చేస్తారు. ఇక శివరాత్రి సమయంలో ఉపవాసాలు, కళ్లు గుడాల పేరిట ఉలవలతో మరికొన్ని ధన్యాలను కలిపి గుగ్గిలు చేస్తారు. వాటిని ఉడికించగా మిగిలిన నీటితో కూడా చారు చేస్తారు. ఒక సారి ఉలవచారు టేస్ట్‌ చేస్తే.. అసలు వదిలి పెట్టం. ఉలవలలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలం ఉలవలు మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ. పోషకాహార లోపం ఉన్నవారు ఉలవలను క్రమం తప్పక తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌, పీచు అధికంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగుదలకు ఉలవలు చాలా మంచిది.

2 / 5
రక్తహీనతతో బాధపడే వారు తరచూ ఉలవలను తీసుకోవడం మంచిదంటున్న పోషకాహార నిపుణులు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తింటే మంచిది. 
ప్రతి రోజూ రెండు చెంచాలైనా ఉలవలు తీసుకుంటే శరీరానికి తగిన క్యాల్షియం అందుతుంది.

రక్తహీనతతో బాధపడే వారు తరచూ ఉలవలను తీసుకోవడం మంచిదంటున్న పోషకాహార నిపుణులు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తింటే మంచిది. ప్రతి రోజూ రెండు చెంచాలైనా ఉలవలు తీసుకుంటే శరీరానికి తగిన క్యాల్షియం అందుతుంది.

3 / 5
రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి రోజూ ఉలవలను ఆహారంలో చేర్చుకంటే బరువు అదుపులో ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి..

4 / 5
రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి.

5 / 5
ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.