ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పాత సీఎస్ ఆదిత్యనాథ్ బాధ్యతలు అప్పగించారు.
ఈ నెల 30తో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు.
1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. సమీర్ శర్మ ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు.
ప్రస్తుతం సమీర్ శర్మ సెంట్రల్ సర్వీసెస్‌లో కొనసాగుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే.. సమీర్ శర్మ కూడా రెండు నెలల్లో.. పదవీ విరమణ చేయనున్నారని సమాచారం.