వికసిత్ భారత్‎ కోసం ప్రధాని మోదీ కీలక సమావేశం.. సమగ్ర భవిష్యత్ కార్యాచరణ సిద్దం..

|

Mar 03, 2024 | 9:13 PM

న్యూఢిల్లీ వేదికగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం అధికారికంగా జరిగింది. ఈ సమావేశంలో, ' వికసిత్ భారత్ 2047 ' విజన్ డాక్యుమెంట్‌పై మేధోమథన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై భవిష్యత్ ప్రణాళికలను రచించారు.

1 / 5

2 / 5

అన్ని శాఖల మంత్రులు 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయే మంచి నిర్ణయాలను చర్చించారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల కోసం ఎలాంటి సంక్షేమం అందించాలన్నదానిపై కసరత్తు చేసి ప్రణాళికను చర్చించారు.

3 / 5
మే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కార్యాచరణ అమలు చేయడానికి 100 రోజుల ఎజెండా కూడా ఫిక్స్ చేశారు. వికసిత్ భారత్ కోసం రెండేళ్ల రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక వేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

మే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కార్యాచరణ అమలు చేయడానికి 100 రోజుల ఎజెండా కూడా ఫిక్స్ చేశారు. వికసిత్ భారత్ కోసం రెండేళ్ల రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక వేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

4 / 5
వారి ఆలోచనలు, సూచనలు అందజేశారు. ఈ భవిష్యత్ కార్యాచరణపై ఇన్‌పుట్‌ కోసం యువతతో సమీక్షించారు. విస్తృత సంప్రదింపులతో కూడిన 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం వివిధ స్థాయిలలో 2,700కి పైగా సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించారు.

5 / 5
ఇందులో 20 లక్షలకుపైగా యువత నుంచి సూచనలు అందినట్లు వెల్లడించారు ప్రభుత్వ అధికారులు. వికసిత్ భారత్ కోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్‌, ఆకాంక్షలు, లక్ష్యాలతో కూడిన సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. ఇందులో రానున్న రోజుల్లో భారత్ ఆర్థిక వృద్ధి, జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం మొదలైనవి ఉన్నాయి.