Phani CH |
Feb 21, 2022 | 3:57 PM
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. నెల్లూరు డైనమిక్ లీడర్ గౌతమ్‌రెడ్డి ఇక లేరన్న సంగతి తెలిసి షాక్‌కి గురవుతున్నారు.
గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రముఖలంతా కదిలివచ్చారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. గౌతమ్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు ఆత్మీయులు.
వారంరోజులపాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న గౌతమ్‌రెడ్డి, ఏపీకి పెట్టుబడులు తేవడానికి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. దుబాయ్ నుంచి నిన్నే హైదరాబాద్ తిరిగొచ్చారు గౌతమ్‌రెడ్డి.
రావడం రావడమే, ఓ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లిపోయారు గౌతమ్‌రెడ్డి. తెల్లవారేసరికి సడన్ స్ట్రోక్. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన గుండె ఆగిపోయింది.
నిన్నటివరకు తమతో కలిసున్న గౌతమ్‌రెడ్డి, తెల్లారేసరికల్లా విగతజీవిగా మారడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. గౌతమ్‌రెడ్డి మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన ఆత్మీయులు.
నిన్నే ఆయన్ని కలిశాం, అంతలోనే ఘోరం జరిగిపోయిందా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగు జాడల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గౌతమ్‌రెడ్డి. 2014లో ఆత్మకూరు నుంచి MLAగా గెలిచి ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019లో సెకండ్ టైమ్ MLAగా గెలిచిన గౌతమ్‌రెడ్డి, ఏపీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్‌గా... సీఎం జగన్ కోర్ టీమ్‌లో ఒకరిగా మారారు.
గౌతమ్‌రెడ్డి పాలిటిక్స్‌లో ఉంటే, మిగతా ఇద్దరు సోదరులు కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి, సోదరులు విక్రమ్‌రెడ్డి, పృథ్వీరెడ్డితో గౌతమ్‌రెడ్డి కలిసున్న ఫొటోను ఇప్పుడు మీరు టీవీ9 స్క్రీన్‌పై చూస్తున్నారు.