కమెడియన్‌ బన్‌గయా సీఎం.. పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ గురించి ఆసక్తికర విషయాలు

|

Mar 10, 2022 | 3:48 PM

కమెడియన్‌ బన్‌గయా CM. నవ్విస్తూ కెరీర్‌ మొదలుపెట్టిన స్టేజ్‌ పెర్‌ఫార్మర్‌- పొలిటికల్‌ స్టేజ్‌ మీదకు చీపురు పట్టుకుని దూసుకువచ్చారు భగవంత్‌ మాన్‌.

1 / 12

2 / 12
పంజాబ్‌లో అకాలీలను, బీజేపీని, కాంగ్రెస్‌ను ఊడ్చిపడేసిన ఆమ్‌ఆద్మీలో ముందునిలబడిన వ్యక్తి భగవంత్‌ మాన్‌. ఎల్లో టర్బన్‌  కట్టుకుని లోక్‌సభలో పంజాబ్‌ వాణి బలంగా వినిపించిన కేజ్రీవాల్‌ నమ్మినబంటు ఈయన.

3 / 12
మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన భగవంత్‌ మాన్‌- ఇవాళ్టి విజయోత్సవ ర్యాలీలో తన తల్లితో కలసి ఎమోషనల్‌గా కనిపించడం ఆయన నేపథ్యాన్ని చాటిచెబుతోంది.

4 / 12
సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా సామాన్యుల పార్టీ నుంచి వచ్చి సైలెంట్‌గా CM అవుతున్న భగవంత్‌ మాన్‌- పంజాబ్‌ ప్రజల సమ్మాన్‌ కోసం పనిచేస్తామంటున్నారు.

5 / 12
రాజకీయాల్లోకి రాకముందు భగవంత్‌ మాన్‌ ఒకప్పుడు కమెడియన్‌. ఒక టీవీ ఛానెల్‌ షోలో భగవంత్‌ మాన్‌ స్టేజీ జోకులు చెబుతుంటే, నవజ్యోత్‌ సిద్ధూ పగలబడి నవ్వి మార్కులు వేశారు.

6 / 12
ఇప్పుడు పంజాబ్‌ ప్రజలు కూడా భగవంత్‌ మాన్‌కు, ఆయన పార్టీ ఆమ్‌ఆద్మీకి అదేవిధంగా మార్కులు వేశారు. ఈ ఎన్నికల్లో సిద్ధూ, ఆయన పార్టీ ఓడిపోతే, భగవంత్‌ మాన్‌, ఆయన పార్టీ- ధమాకా విజయం సాధించారు.

7 / 12
48 ఏళ్ల భగవంత్‌ మాన్‌- పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా సతోజ్‌లో పుట్టారు. కాలేజీ రోజుల నుంచి యూత్‌ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవాడు. జుగ్నూ ఖేండా హైతో మొదలుపెట్టి- జుగ్నూ మస్త్‌ మస్త్‌ వంటి షోలతో పేరుతెచ్చుకున్నారు.

8 / 12
ఇక స్టార్‌ప్లస్‌లో వచ్చిన "గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌"తో ఒక వెలుగు వెలిగారు.2014లో ఆమ్‌ఆద్మీలో చేరడం భగవంత్‌ మాన్‌ కెరీర్‌లో మరో మలుపు. అప్పటినుంచి రెండుసార్లు సంగ్రూర్‌ నుంచి గెలిచి, లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

9 / 12
ఆయన మందుకొట్టి రావడం వివాదాదస్పదమైంది. దీంతో తాను ఇక మద్యం తాగనంటూ కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.భగవంత్‌ మాన్‌ను ఈసారి ప్రజల ఓటింగ్‌ ద్వారా CM అభ్యర్థిగా ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్‌ ప్రకటించడం కీలకంగా మారింది.

10 / 12
కాంగ్రెస్‌, బీజేపీలకన్నా భిన్నంగా ప్రజల్లోకి వెళ్లడం, అవినీతి మరక లేకపోవడం ఆమ్‌ఆద్మీకి కలసి వచ్చింది. ఢిల్లీ తరహాలో నిజాయితీ పాలన అందిస్తామన్న కేజ్రీవాల్‌ భరోసాకు భగవంత్‌ మాన్‌ ఒక ప్రతిరూపంగా నిలిచారు.

11 / 12
 తన తొలి ప్రయారిటీ ఉద్యోగాలే అంటున్నారు భగవంత్‌ మాన్‌. తాను పంజాబీలందరికీ ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నారు. ఏళ్లతరబడి పాతుకుపోయిన పెద్దపార్టీలకు భిన్నంగా పంజాబ్‌లో సరికొత్త పాలన అందించడం ఇప్పుడు భగవంత్‌ మాన్‌ చేతుల్లో ఉంది.

12 / 12
పంజాబ్‌ కింగ్‌, జుగ్నూ వంటి పేర్లతో పంజాబీలకు పరిచయమైన ఈ నాయకుడు- ఇప్పుడు తన మార్క్‌ను కొత్త పేరును తెచ్చుకుంటాడని ఆమ్‌ఆద్మీ ఆశిస్తోంది.