BRS Party: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్, ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతోపాటూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ముందు ఉంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంతం మొతం గులాబీ మయమైంది. ఈ నెల 9న మంచి ముహూర్తం ఉండటంతో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దమైనట్లు అధికారికంగా అందుతున్న సమాచారం.