- Telugu News Photo Gallery PM Narendra Modi feeds cows on the occasion of Makar Sankranti at his residence
PM Modi: పుంగనూరు ఆవులకు దాణా తినిపించిన ప్రధాని మోదీ.. ఆప్యాయంగా హత్తుకుని..
PM feeds cows: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినాన పౌరులందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవాహం నిరంతరం కొనసాగాలంటూ ఆకాంక్షించారు.
Updated on: Jan 14, 2024 | 4:54 PM

PM feeds cows: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినాన పౌరులందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవాహం నిరంతరం కొనసాగాలంటూ ఆకాంక్షించారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులతో సరదాగా గడిపారు. వాటికి స్వయంగా దాణా తినిపించారు.

ప్రధాని మోదీ ఇంటి ఆవరణలో పుంగనూరు ఆవులకు దాణాతోపాటు.. మేతను తినిపించారు. కూర్చిలో కూర్చొని వాటిని హత్తుకుంటూ.. మేతను తినిపిస్తూ మోదీ కనిపించారు.

ఇదిలాఉంటే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత సంప్రదాయ వస్త్రమైన ముండును ధరించి కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నల్లకోటుతోపాటు భుజంపై శాలువా కూడా వేసుకున్నారు.