ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం (జులై 18) పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్ కర్అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగును ప్రారంభించనున్నారు. కాగా ఈ నూతన టెర్మినల్ బిల్డింగ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. చూడడానికి ఈ భవనం అచ్చు శంఖం ఆకారాన్ని పోలి ఉంటుంది. చుట్టూ ఉండే దీవులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఈ ఎయిర్‌పోర్ట్ బిల్డింగును నిర్మించారు.
సుమారు రూ.710 కోట్లతో అత్యాధునిక సదుపాయాలు, హంగులతో ఈ టెర్మినల్ బిల్డింగ్‌ను రూపొందించారు. ఏటా సుమారు రూ. 50 లక్షల మంది యాత్రికులను తట్టుకునేలా ఈ బిల్డింగ్‌ను తీర్చిదిద్దారు. ఈ టర్మినల్ ద్వారా ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
సుమారు 40,800 చదరపు మీటర్ ల విస్తీర్ణం కలిగిన ఈ విమానాశ్రయంలో బోయింగ్-767- 400 విమానాలు, ఎయిర్ బస్-321 రకం విమానాల ఆగేందుకు 80 కోట్ల రూపాయల ఖర్చు తో ఒక ఏప్రన్ ను నిర్మించారు. దీని ద్వారా ఈ విమానాశ్రయంలో ఏక కాలం లో పది విమానాల ను నిలిపి ఉంచవచ్చు.
వేడిమి ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ భవనాన్ని డబల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్‌తో తీర్చిదిద్దారు. అలాగే తగినంత మోతాదు లో సూర్య కాంతి వీలైనంత ఎక్కువ స్థాయి లో ప్రవేశించడం కోసం స్కైలైట్స్ ఏర్పాటు చేశారు. ఎల్ఇడి లైటింగ్, వేడిమి ని తగ్గించే గ్లేజింగ్ వంటి స్థిరత్వం కలిగిన అనేకమైన ప్రత్యేకత లు ఈ భవనంలో ఉన్నాయి.
అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు లో వాన నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంది. ఇక వ్యర్థ జలాల ను పూర్తి గా శుద్ధి చేసి లేండ్ స్కేపింగ్ కోసం తిరిగి ఉపయోగం లోకి తీసుకువస్తారు.
వీలైనంత వరకు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అత్యాధునిక సదుపాయాలతో ఈ టెర్మినల్‌ను తీర్చి దిద్దారు. మంగళవారం ఉదయం పూట 10:30లకు మోడీ ఈ కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించనున్నారు.