PM Modi: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోల్‌కతా మెట్రో పర్పుల్‌ లైన్‌.. శుక్రవారం పచ్చ జెండా ఊపనున్న ప్రధాని మోదీ..

|

Dec 29, 2022 | 1:45 PM

కోల్‌కతాలో మెట్రో పర్పుల్‌ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. 6.5 కి.మీలో పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని ఏకంగా రూ. 2475 కోట్లతో నిర్మించారు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి..

1 / 5
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్ వచ్చే శుక్రవారం ప్రారంభం కానుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఒక రోజు పర్యటనలో హౌరా స్టేషన్ నుంచి జోకా-తరత్లా మెట్రోను ప్రారంభిస్తారు.

2 / 5
జోకా-తరత్లా మెట్రో మార్గాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్‌ (జోకా-తరత్లా) మెట్రోను ప్రారంభిస్తారు బెంగాల్ పర్యటనలో మోదీ వర్చువల్‌గా మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

3 / 5
 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని మొత్తం రూ. 2475 కోట్లతో నిర్మించారు. ఈ నిర్మాణం ద్వారా దక్షిణ కోల్‌కతాకు చెందిన సర్సునా, డక్‌ఘర్‌, ముచిపరాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించనుంది.

4 / 5
ఇందులో భాగంగా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ అరోరా ఇప్పటికే డిసెంబర్‌ 24వ తేదీన పలు మెట్రో స్టేషన్స్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ కొత్త మార్గంలో ఆరు స్టేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

5 / 5
 ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితోపాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్‌ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే మెట్రో ప్రారంభోత్సవం జరిగినా ప్రయాణికులకు మాత్రం జనవరి 2వ తేదీ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది.