
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'భారత్ శక్తి' పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం గొప్పగా నిర్వహించారు. ఇక్కడ భారతదేశపు త్రిదళాధిపతులు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు.

త్రివిధ దళాధిపతులు స్వయంగా అందులోనూ దేశీయంగా తయారు చేసిన రక్షణ పరికరాల పనితీరును ప్రదర్శించారు. సొంతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం అని ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రధాని మోదీ చెప్పారు.

గత దశాబ్దంలో దేశ రక్షణ ఉత్పత్తి రెండింతలు పెరిగిందని, ఇది రూ. 1 లక్ష కోట్లకు మించిందని అన్నారు. ఈ విజయంలో యువత కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. గత 10 సంవత్సరాలలో, 150 కంటే ఎక్కువ డిఫెన్స్ స్టార్టప్‌లు ఉద్భవించాయన్నారు.

సాయుధ దళాలకు మద్దతుగా రూ. 1,800 కోట్ల విలువైన ఆర్డర్‌లను ఇచ్చాయని ప్రధాని చెప్పారు. రక్షణ రంగంలో స్వదేశీ ఆయుదాల తయారీ భారతదేశంపై విశ్వాసాన్ని నింపుతుందని ప్రధాని వెల్లడించారు ఈ విన్యాసాలు సుమారు 50 నిమిషాల పాటు కొనసాగాయి.

ప్రతి యుద్ద నౌకల పనితీరును దగ్గరుండి మరీ వీక్షించారు ప్రధాని మోదీ. ఈయనతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థల్లో T-90 (IM) ట్యాంకులు, ధనుష్, సారంగ్ గన్ సిస్టమ్స్, ఆకాష్ వెపన్స్ సిస్టమ్, లాజిస్టిక్స్ డ్రోన్స్, రోబోటిక్ మ్యూల్స్, ALH తోపాటు వివిధ మానవరహిత వైమానిక వాహనాలు కలిగిఉన్నట్లు మోదీ వెల్లడించారు.

అటానమస్ కార్గో క్యారీయింగ్ ఏరియల్ వెహికల్స్, ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్‌లను ప్రదర్శిస్తుందని తెలిపారు. భారత వైమానిక దళంలోని స్వదేశీ విమానాలు తేజస్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు అధునాతనమైన సాంకేతికతను కలిగిఉన్నట్లు పేర్కొన్నారు.