
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి చేరుకున్నారు. మెగా రోడ్ షో సందర్భంగా కేరళ ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. మోదీ ప్రజలకు చేయి ఊపుతూ దాదాపు కిలోమీటరు మేర రోడ్డుపై నడిచారు.

కేరళ తరహా దుస్తులు ధరించి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని కొచ్చి చేరుకున్నారు.

ప్రధాని మోదీ జుబ్బా, బంగారు అంచుతో ధోతీ , శల్య ధరించి కేరళకు వచ్చారు.

తేవర జంక్షన్ నుంచి తేవర సేక్రెడ్ హార్ట్ కళాశాల మైదానం వరకు 1.8 కి.మీ మెగా రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

మంగళవారం ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

కేరళలో 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.