సమ్మర్లో రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? మీ బడ్జెట్ లో హైదరాబాద్‌కు అతి దగ్గర్లో బెస్ట్ ఇవే..!

Updated on: May 01, 2025 | 9:10 AM

వేసవి సెలవులు వచ్చేశాయి.. పుస్తకాలతో కుస్తీపట్టిన పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే, రోజూ ఉద్యోగం, పని ఒత్తిడితో అలిసిపోయిన పేరెంట్స్‌ కూడా రిఫ్రెష్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సమ్మర్‌ టూర్స్‌ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే, మీరు కూడా అలాంటి ప్లానింగ్‌లో ఉన్నారా..? మీ ఈ సమ్మర్‌ని మరిచిపోలేని మెమొరీగా మార్చుకోవాలనుకుంటున్నారా? అందుకోసం రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే మాత్రం మన తెలంగాణలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మీ బడ్జెట్‌లోనే, మీ మనసుకు నచ్చే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ప్లాన్స్‌ ఇక్కడ చూద్దాం..

1 / 6
సమ్మర్‌ హాలీడేస్‌ అయినప్పటికీ మనం చేస్తున్న ఉద్యోగాల కారణంగా ఎక్కువ సెలవులు పెట్టే అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారికి హైదరాబాద్‌కు అతి చేరువలో, రోడ్డు మార్గంలో కూడా ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ వెళ్ల దగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య ఉండి స్వచ్ఛమైన గాలి పిలుస్తూ.. మిమ్మల్ని అమితంగా ఆదరిస్తూ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి.

2 / 6
Kawal Tiger Reserve- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా ప్రసిద్ధి. ఇది ప్రకృతి రమణీయత గల ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం..ఇక్కడ అనేక జలపాతాలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కుంతల రాజ్యం నాటి కుంటాల జలపాతం, బోథ్- పొచ్చెర జలపాతం, కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ- జంగల్ సఫారీ, బాసర సరస్వతి దేవాలయం, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, నిర్మల్ కొయ్యబొమ్మలు మొదలైనవి మిమ్మల్ని కట్టిపడేస్తాయి.. హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ఈ పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడికి చేరుకోడానికి ప్రసిద్ధ నేషనల్ హైవే 44తో విశాలమైన రోడ్డు కనెక్టివిటీ ఉంది. మీకు బెస్ట్‌ రోడ్‌ ట్రిప్‌ అనుభవాన్ని అందిస్తుంది.

3 / 6
Pocharam Wildlife Sanctuary-ఒకప్పటి నిజాం రాజు షికార్ ఘర్‌‌‌‌... ఇప్పటి టూరిస్ట్ స్పాట్‌‌. ఉదయం నుంచి రాత్రి వరకు పని ఒత్తిడితో సతమతమయ్యే వాళ్లకు మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశం పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మెదక్‌‌‌‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ కృష్ణ జింకల గుంపులతోపాటు నీల్‌‌‌‌గాయ్‌‌‌‌, సాంబార్‌‌‌‌, నెమళ్లు, కొండగొర్రెలు, ముళ్లపందులు, కుందేళ్లను చూడొచ్చు. వీకెండ్స్‌‌లో పిల్లలతో కాసేపు హాయిగా గడపాలి అనుకునేవాళ్లకు పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరాఫ్​అడ్రస్. హైదరాబాద్ కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రదేశం ఉంది.

4 / 6
Bidar Fort-హైదరాబాద్ కు సుమారు 140 కి.మీ దూరంలో ఉంటుంది బీదర్. ఈ పట్టణం కర్ణాటకలోని ఈశాన్య భాగంలో ఉంది. 15వ శతాబ్దానికి చెందిన స్మారక కట్టడాలతో, ఈ ప్రదేశం గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలలో ఇది ఒకటి. బీదర్ కోట పట్టణంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రాంతం వర్షాకాలంలో పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడే సింగూర్ డ్యామ్ మీరు మీరు సందర్శించగల మరొక అద్భుత ప్రదేశం. 14 వ శతాబ్దంలో బహమనీ రాజ్యానికి బీదర్ రాజధానిగా ఉండేది . ఈ కోటను అహ్మద్ షా వాలి బహమాన్ నిర్మించాడు. 15వ శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా-I తన రాజధానిని కలబురగి (గుల్బర్గా) నుండి బీదర్‌కు మార్చినప్పుడు ఈ కోటను పునరుద్ధరించాడని చెబుతారు.

5 / 6
Karimnagar Tourism- హైదరాబాద్ నుంచి సుమారు160 కిలోమీటర్ల  దూరంలో ఉండే కరీంనగర్ జిల్లా కేంద్రం ఉంటుంది. ఇది తెలంగాణలోని ఒక చారిత్రాత్మక పట్టణం. దీనిని 'వేద అభ్యాస పీఠం' అని పిలుస్తారు. అనేక చారిత్రాత్మక కట్టడాలకు, అధ్యాత్మిక కేంద్రాలకు ఈ జిల్లా నిలయంగా ఉంది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ప్రముఖమైన దైవ సన్నిధాలు సందర్శించవచ్చు.
ఇక్కడి చారిత్రక సంపదలైన ఎలగంధల కోట, నగునూర్ ఫోర్ట్, రామగిరి ఫోర్ట్, మోలంగూర్ ఫోర్ట్, జగిత్యాల కోటలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి గుంతలు, అడ్డంకులు లేని పరిశుభ్రమైన రహదారిపైన స్మూత్ రైడ్‌ను అనుభవించాలనుకునే వారికి, కరీంనగర్ మంచి ఛాయిస్ అవుతుంది.

Karimnagar Tourism- హైదరాబాద్ నుంచి సుమారు160 కిలోమీటర్ల దూరంలో ఉండే కరీంనగర్ జిల్లా కేంద్రం ఉంటుంది. ఇది తెలంగాణలోని ఒక చారిత్రాత్మక పట్టణం. దీనిని 'వేద అభ్యాస పీఠం' అని పిలుస్తారు. అనేక చారిత్రాత్మక కట్టడాలకు, అధ్యాత్మిక కేంద్రాలకు ఈ జిల్లా నిలయంగా ఉంది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ప్రముఖమైన దైవ సన్నిధాలు సందర్శించవచ్చు. ఇక్కడి చారిత్రక సంపదలైన ఎలగంధల కోట, నగునూర్ ఫోర్ట్, రామగిరి ఫోర్ట్, మోలంగూర్ ఫోర్ట్, జగిత్యాల కోటలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి గుంతలు, అడ్డంకులు లేని పరిశుభ్రమైన రహదారిపైన స్మూత్ రైడ్‌ను అనుభవించాలనుకునే వారికి, కరీంనగర్ మంచి ఛాయిస్ అవుతుంది.

6 / 6
Warangal-హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా.  వరంగల్ వెళ్లే దారి మధ్యలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని కూడా సందర్శించవచ్చు. కాకతీయుల కళావైభవాలుగా విలసిల్లుతున్న వెయ్యి స్తంభాల గుడి, రామప్ప మందిరం మొదలగు చారిత్రాత్మక కట్టడాలు చూడొచ్చు. వరంగల్ సిటీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉంది. ఈ చెరువులో 160 మీ పొడవైన హాంగింగ్ బ్రిడ్జ్ ఉండటం దీని ప్రత్యేకత, బోటింగ్ కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. ప్రకృతి సౌందర్యాలు నింపుకున్న పాకాల చెరువు వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతం సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.