నేటి జీవన శైలి, అస్తవ్యస్తమైన ఆహార అలవాట్ల కారణంగా ఎంతో మంది యువత అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే రక్తపోటుకు గురవుతున్నారు. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం, వాల్నట్లు వాటి వివిధ డ్రై ఫ్రూట్స్‌పై విస్తృతంగా అధ్యయనం చేయగా .. వాటిల్లో పిస్తాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తేలింది. అందుకే వీటిని రోజు వారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పిస్తాలు ఆరోగ్యకరమైనవి. వీటిల్లో మంచి కొవ్వు, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిస్తాలో పాలీఅన్‌శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దోహదపడతాయి.
రోజూ పిస్తాపప్పు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయి.
పిస్తాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను దరికి చేరనివ్వవు. చెడు కొలెస్ట్రాల్ గుండెకు మరింత హాని కలిగిస్తుంది. పిస్తా పప్పులు రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. హృదయ స్పందన రేటును సక్రమంగా ఉంచుతుంది. రక్తనాళ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
పిస్తాపప్పులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందుకే రోజూ పిస్తా తింటే కొద్ది రోజుల్లోనే శరీరం దృఢంగా మారుతుందంటున్నారు నిపుణులు.