పిస్తా పప్పులు అతిగా తింటే అంతే సంగతులు..! ఏం జరుగుతుందో తెలుసా..?

Updated on: Jul 17, 2025 | 5:31 PM

పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మెగ్నిషియం, కాపర్, జింక్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి ఎన్నో ఖనిజాలు, మినరల్స్ సమృద్ధిగా నిండి ఉంటాయి. పిస్తా తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మెదడు పని తీరు కూడా మెరగవుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మోనోశాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెట్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తా పప్పులో ఉంటాయి. దీంతో.. పిస్తా పప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. కంటి చూపు మెరుగవుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, మంచిదని పిస్తా పప్పును అతిగా తినటం వల్ల అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
పిస్తా పప్పును అతిగా తినటం వల్ల అధిక కేలరీలు అందుతాయి. దీంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ స్థాయిలో కూడా మార్పులు రావచ్చు అంటున్నారు. పిస్తా పప్పును అతి తినడం వల్ల ఒక్కోసారి అజీర్ణంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
ప్రాసెస్డ్ పిస్తాలో ఉప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది రక్తపోటును పెంచే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కిడ్నీపై కూడా ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఎక్కువ పిస్తాపప్పులు తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వాటి అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్ , డయేరియాతో సహా జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

3 / 5
నిత్యం అధికంగా తింటే ఫ్యాటిగ్‌ వచ్చే అవకాశం ఉంది. చర్మంపై అలర్జీలు కూడా కలిగే అవకాశం ఉందంటున్నారు. పిస్తాపప్పులో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. ఎక్కువ మొత్తంలో పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పిస్తాతో అస్పష్టమైన దృష్టి, మైకం, మూర్ఛ వంటి దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. కొందరికి శ్వాస కోస సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అలెర్జీతో బాధపడుతుంటారు. వీళ్లలో కొందరికి సీడ్స్, డ్రై ఫ్రూట్స్ పడవు. అందుకే అలర్జీ సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పుకి దూరంగా ఉండాలి.

5 / 5
పిస్తా పప్పు ఎక్కువ తినడం వల్ల శరీరంలో వేడి బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో.. వేడి వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పిస్తా పప్పు తినకపోవడమే మంచిది.