
మీరు ఇంట్లో కుక్కను పెంచుకోవాలనుకుంటే.. వాటి జాతుల గురించి తెలుసుకుందాం. ఈ జాతుల కుక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. అవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చాలా త్వరగా కలిసిపోతాయి. ఈరోజు మీరు ఇంట్లో ఏ జాతి కుక్కను పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

లాబ్రడార్ రిట్రీవర్ - మీరు మీ ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ జాతి కుక్కలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అంతేకాదు తక్కువ ధరకు లభిస్తుంది. ఈ కుక్కలు యజమాని పట్ల చాలా విధేయత కలిగి ఉంటాయి.

పోమరేనియన్ - ఈ కుక్క చాలా చిన్నది. ఈ కుక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. పిల్లలు ఈ కుక్కతో హాయిగా ఆడుకోవచ్చు. మీరు కుక్కను ఇంట్లో పెంచుకోవాలనుకుంటే ఈ కుక్క ఉత్తమం అని చెప్పవచ్చు.

గోల్డెన్ రిట్రీవర్ - మీరు గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ కుక్క పిల్లలతో సులభంగా కలిసిపోతుంది. ఈ కుక్కలకు తర్ఫీదు ఇస్తే క్రీడలను బాగా ఆడతాయి. చాలా వేగంగా ఉంటాయి. ఈ కుక్కలు తమ యజమానులతో కలవడానికి ఇష్టపడతాయి.

బీగల్ డాగ్ - ఇంట్లో బీగల్ డాగ్‌ని పెంచుకోవడం చాలా సులభం. ఈ కుక్కలు పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈ జాతి కుక్కల స్వభావం చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఈ జాతి కుక్క కుటుంబం సభ్యులతో కలిసిపోతుంది.