
నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. నెయ్యితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో నెయ్యిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెయ్యితో చేసే ఏ ఆహారానికైనా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కానీ ఈ అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు మాత్రం నెయ్యికి దూరంగా ఉండాల్సిందే.

గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు సైతం నెయ్యికి దూరంగా ఉండండి. నెయ్యిలో అధిక మొత్తంలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. చలి కాలంలో ఈ సమస్య మరింత పెరగొచ్చు. కాబట్టి తినకపోవడమే మంచిది.

నెయ్యి తినేందుకు రుచిగా ఉన్నా.. జీర్ణం అయ్యేందుకు మాత్రం సమయం పడుతుంది. కాబట్టి అజీర్తి సమస్యలు ఉన్నవారు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం దూరంగా ఉండాలి. మరింత పెరిగే అవకాశం ఉంది.

బరువు తగ్గాలి అనుకునేవారు సైతం నెయ్యికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఎండే ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే పాల ఉత్పత్తులు అంటే అలెర్జీ ఉన్నవారు కూడా దూరంగా ఉండాలి.

జలుబు, జ్వరం ఉన్నవారు సైతం నెయ్యికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో తీసుకుంటే శరీరంలో కఫం పెరుగుతుంది. ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి నెయ్యిని చాలా మితంగా తీసుకోవడమే మేలు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)