- Telugu News Photo Gallery Papaya Leaf Benefits: What Are The Benefits Of Drinking Papaya Leaf Boiled Water, Know Details here
Papaya Leaf Benefits: బొప్పాయి ఆకులు ఈ వ్యాధులను సులువుగా నివారిస్తాయి.. అయితే ఓ షరతు!
బొప్పాయి పండులో ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో, దాని ఆకులలో కూడా అదే స్థాయిలో ఔషద గుణాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. పచ్చి, పండిన బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకుల్లో కూడా రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి..
Updated on: Mar 24, 2024 | 1:12 PM

బొప్పాయిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్నాయి. అలాగే బొప్పాయి కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది. బొప్పాయిని ఉదయాన్నే తింటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాంతిని కూడా పెంచుతుంది.

పచ్చి, పండిన బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకుల్లో కూడా రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి.

బొప్పాయి ఆకులలోని పోషఖాలు శరీరాన్ని ఎలాంటి వ్యాధి బారిన పడకుండా కాపాడతాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక ప్రకారం.. బొప్పాయి ఆకులను ఆసియా దేశాలలో అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.

బొప్పాయి ఆకులను ఆయుర్వేదంతో సహా అనేక రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ ఆకును డెంగ్యూ నివారణగా కూడా ఉపయోగించవచ్చు. ఈ ఆకు క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, న్యూరోప్రొటెక్టివ్ వంటి వ్యాధులతో పోరాడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది.

అయితే బొప్పాయి ఆకుల రసాన్ని ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ఎందుకంటే బొప్పాయి ఆకు రసం శరీరంలోని కొన్ని భాగాలకు ప్రమాదకరం. బొప్పాయి ఆకులలో గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, సపోనిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లు, ఎంజైములు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.




