
కావాల్సిన పదార్ధాలు : పావు కిలో పండు మిర్చి, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 5 స్పూన్స్ నిమ్మరసం, రెండు ఉల్లిపాయలు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

తోట లేదా మార్కెట్లోకి వెళ్ళి పండు మిర్చిని కోసి వాటిని శుభ్రంగా కడిగి తేమ లేకుండా పలుచటి క్లాత్ తో వాటిని బాగా తుడిచి ఒక ప్లేట్ మీద పెట్టి ఫ్యాన్ కింద పెట్టి వాటిని బాగా ఆరబెట్టాలి.

ఆ తర్వాత మిరప తోడిమిలను తీసి వాటిని రెండు లేదా మూడు ముక్కలుగా కోసి వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోటిలో వేసి కచ్చా పచ్చగా గా దంచుకోవాలి.

ఆ తర్వాత వాటిలో పది వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా నూరుకోవాలి. మిక్సీ లేదా గ్రైండ్ చేసేకన్నా రోటిలో నూరితే పండు మిర్చి మరింత రుచిగా ఉంటుంది.

మిర్చి పచ్చడి రెడీ అయిన తర్వాత చివర్లో మూడు స్పూన్స్ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. మీకు మంట లేకుండా తినాలి అనుకుంటే అర కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసి తినొచ్చు.