నూనె వాడకుండా.. పొయ్యి వెలిగించకుండా రుచికరమైన భోజనం.. ఎక్కడో తెలుసా ?

|

Jul 11, 2023 | 7:08 PM

నూనె వాడకుండా.. పొయ్యి వెలిగించకుండా ఎవరైన వంట చేయగలరా ?. దీనికి చాలామంది సాధ్యం కాదు అని సమాధానమిస్తారు. అయితే ఓ వ్యక్తి తన రెస్టారెంట్‌లో నో ఆయిల్- నో బాయిల్ అనే కాన్సెప్ట్‌తో రుచికరమైన వంటలను అందిస్తున్నారు. ఆయనే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శివకుమార్.

1 / 6

2 / 6
శివకుమార్‌కు చిన్నప్పటి నుంచే వంటలు చేయడం అంటే మక్కువ. ఎప్పుడూ కూడా రకరకాల వంటలు చేస్తూ అందరికీ రుచి చూపిస్తుండేవాడు. ఈయన శాఖాహారం మాత్రమే తింటుండేవాడు. నూనె లేకుండానే వంట ఎలా చేయాలో శిక్షణ తీసుకొని దాదాపు రెండువేల కొత్త వంటలు కనిపెట్టాడు. ఆ తర్వాత సొంతంగా కోయంబత్తూర్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు.

3 / 6
సాధారణంగా రెస్టారెంట్‌లో వివిధ రకాల ఫుడ్ కలర్స్ కలిపి.. అనవసరమైన మసాలాలు వేసి వండేస్తుంటారు. ఇప్పటికీ చాలామంది నాణ్యత లేని ఆయిల్‌ను కూడా వాడుతున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తినడం వల్లే గుండెజబ్బులు, అలర్జీ లాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది జగమెరుగిన సత్యం.

4 / 6
ఇలాంటి కల్తీ ఆహారానికి చెక్ పెట్టేందుకే శివ కుమార్ నో ఆయిల్- నో బాయిల్ అనే కాన్సెప్ట్‌‌ను తీసుకొచ్చాడు. ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఆహారం తినాలనే ఉద్ధేశంతోనే ఈ సహజ ఆహర పద్ధతిని తీసుకొచ్చానని చెబుతున్నాడు.

5 / 6
నూనె లేకుండా, పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేస్తారనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఆ రెస్టారెంట్‌లో టమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలు, కొబ్బరిపాలను మిక్సిపట్టి రుచికరమైన సాంబార్‌ను తయారుచేస్తున్నారు. అలాగే బియ్యానికి బదులు అటుకులనే నానబెట్టి అందులో కొబ్బరితురుమునీ, జీలకర్రలను చేర్చీ కస్టమర్లకు వడ్డిస్తున్నారు.

6 / 6
మరోవిషయం ఏంటంటే ఈ రెస్టారెంట్‌లో చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి ఐటెమ్స్ దొరుకుతాయి. దాదాపు మూడు సంవత్సరాల నుంచి శివకుమార్ ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. జనాలు కూడా ఈ రెస్టారెంట్‌లో తినేందుకు క్యూలు కడుతున్నారు.