శీతాకాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి. సంవత్సరంలో ఒక్క ఈ సీజన్‌లో మాత్రమే నారింజ లభిస్తాయి. అనేక మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే రోజూ నారింజ పండ్లను తినడం ఆరోగ్యకరమా? రోజూ నారింజ పండ్లను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలు ఆరోగ్య నిపుణుల మాటల్లో మీకోసం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో నారింజ తినడం వల్ల విటమిన్ సి వంటి అవసరమైన పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. నారింజలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
నారింజలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నారింజలో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.
రోజూ నారింజ పండ్లను తింటే బరువు అదుపులో ఉంటుంది. నారింజలో ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండాలంటే చలికాలంలో తప్పనిసరిగా నారింజను తినాలి. నారింజలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Oranges - నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అవి పొటాషియం మరియు ఫోలేట్‌తో సహా పోషకాలను కలిగి ఉంటాయి. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.