Kidney Stones: రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్‌.. మీరూ ట్రై చేయండి

|

Oct 30, 2024 | 1:07 PM

నేటి కాలంలో అనేక మంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి తేలికగా బయట పడాలంటే రోజూ ఉదయాన్నే గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ తాగితే సమస్య సమసిపోతుందని నిపుణులు చెబుతున్నారు..

1 / 5
ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి. విటమిన్ B-9, ఫోలేట్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.

2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ కిడ్నీలో రాళ్లకు కూడా తొలగిస్తుంది.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నారింజ రసంలో విటమిన్ సి, పొటాషియం, సిట్రిక్ యాసిడ్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్.. మూత్రంలో pH విలువను నిర్వహించడానికి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయాన్నే తాజా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు దరిచేరవు.

4 / 5
కిడ్నీలో రాళ్లు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది - కాల్షియం ఆక్సలేట్ రాళ్లు. ఇది చాలా సాధారణం. రెండవది - యూరిక్ యాసిడ్ రాళ్లు. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలకు దారితీస్తుంది. ఆరెంజ్ జ్యూస్ మూత్రంలో సిట్రేట్ స్థాయిని పెంచుతుంది. ఇది కాల్షియం ఆక్సలేట్‌తో పాటు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని కొన్ని లక్షణాలు యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

5 / 5
ఇంట్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాజా ఆరెంజ్ జ్యూస్ తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని నివారించవచ్చు. శరీరంలోని వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.