
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. అయితే మీరు ఉపయోగించే ఫోన్ నెంబర్ కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు న్యూమరాలజీ నిపుణులు. అది ఎలా అంటే?

సంఖ్యా శాస్త్రం ప్రకారం, మీ మొబైల్ నెంబర్‌లోని ప్రతి సంఖ్య మీకు అదృష్టం లేదా దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అది ఎలా తెలుసుకోవాలంటే? మీరు మీ ఫోన్ నెంబర్ మీ జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలంటే, ముందుగా మీ మొబైల్ నెంబర్ సంఖ్యలన్నింటిని కలిపి జోడించాలి.

అన్ని నెంబర్లు కలిపి ఒక సంఖ్య వస్తది. ఆ సంఖ్య మీ లక్కీ నెంబర్ లేదా, మూల సంఖ్య సమానంగా వస్తే అది మీకు అదృష్ట సంఖ్య అన్నట్లు అర్థం. ఉదాహరణకు మీ మూల సంఖ్య ఎలా తెలుసుకోవాలి అంటే? ఒక వేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 2 తేదీ అయితే మీ పుట్టిన నెల 12 రెండు అంకెలను కలపితే 14 వస్తుంది. 1, 4 కలిపితే 5 వస్తుంది ఇది మీ మూల సంఖ్య.

అదే విధంగా మీ మొబైల్ నెంబర్ 81350969 అనుకోండి. ఈ అంకెలన్నీ కలిపితే 41. 4, 1 కలిపితే 5. ఇలా మీ లక్కీ నెంబర్ లేదా మూల సంఖ్య, మీ ఫోన్ నెంబర్ సంఖ్య రెండు ఒకే విధంగా వచ్చినట్లైతే అది మీకు అదృష్ట నెంబర్ అవుతుందని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.

అదే విధంగా న్యూమరాలజీ ప్రకారం,5, 7,1,3, 9 లను శుభ సంఖ్యలుగా పరిగణిస్తారు, అయితే 2, 4, 6, 8 లను అశుభ సంఖ్యలుగా పరిగణిస్తారంట. మరీ ముఖ్యంగా ఫోన్ నెంబర్ రెడు, లేదా ఏనిమిది రాకూడదు అంటున్నారు నిపుణులు.