Solo Travelling: ఒంటరిగా ప్రకృతి ఒడిలో గడపాలనుకుంటే.. ఈ ప్రదేశాలకు తప్పక వెళ్లండి.. అద్దిరిపోయే అనుభూతి పక్కా..!

|

May 05, 2023 | 1:38 PM

చాలా మంది ఒంటరి ప్రయాణాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒంటరితనం అందించే అనుభూతిని తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతుంటారు. మీరు అలాంటివారే అయితే ఈ ప్రదేశాలను మీ సందర్శనకు ఎంచుకోవచ్చు.

1 / 5
చాలా మంది ఒంటరి ప్రయాణాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒంటరితనం అందించే అనుభూతిని తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతుంటారు. మీరు అలాంటివారే అయితే ఈ ప్రదేశాలను మీ సందర్శనకు ఎంచుకోవచ్చు. ఇక ఉండే అందమైన ప్రకృతి మీ మనసుకు ఎంతో నచ్చుతుంది. ఇంకా మిమ్మత్ని మంత్రముగ్ధులను చేస్తుంది.

2 / 5
కనాటల్:  అందరి నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్నే కనుక మీరు కోరుకున్నట్లయితే ఉత్తరాఖండ్‌లో ఉన్న కనాటల్‌ని సందర్శించండి. మీరు ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉండే ఆపిల్ తోటలను, పచ్చని వాతావరణాన్ని  ఆస్వాదించవచ్చు. ఇంకా మీరు పరిసర ప్రాంతాలలో ఉన్న  ధనౌల్తి, ముస్సోరీ, టెహ్రీ,సుర్కంద దేవి ఆలయాలను కూడా సందర్శించవచ్చు.

3 / 5
లాన్స్‌డౌన్: ఉత్తరాఖండ్‌లోనే ఉన్న మరో ప్రశాంతమైన, అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ మిమ్మల్ని ఆకర్షించే చాలా పైన్, ఓక్ చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ ప్రాంతంలోనే సెయింట్ మేరీస్ చర్చి, టిప్ ఇన్ టాప్ పాయింట్, శ్రీ తారకేశ్వర్ ధామ్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

4 / 5
అల్మోర: అల్మోరా కూడా చాలా ప్రసిద్ధి చెందిన అందమైన హిల్ స్టేషన్. దీని చుట్టూ ఎత్తైన దేవదారు వృక్షాలు ఉన్నాయి. చల్లగా వీచే ఇక్కడి గాలి మీకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది అద్భుతమైన ప్రదేశమని కూడా చెప్పుకోవాలి.

5 / 5
ఔలి: ‘గేట్‌వే ఆఫ్ హిమాలయా’గా ప్రసిద్ధి పొందిన ఔలిని కూడా మీరు సందర్శించవచ్చు. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఈ సుందరమైన హిల్ స్టేషన్ మీ మనుసును ఆకట్టుకుంటుంది. మీరు స్కీయింగ్ చేయాలనుకుంటే, ఈ ప్రదేశం అందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ  వృద్ధ్ బద్రి ఆలయం, నందా దేవి నేషనల్ పార్క్‌లను కూడా సందర్శించవచ్చు.