
కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల చేపలు , ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, పెరుగు, ఉప్పు , నూనె, యాలకులు, దాల్చిన చెక్క , అర టీ స్పూన్ పసుపు, జీడిపప్పులు , బిర్యానీ ఆకు , కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా చేప ముక్కలను వాటిని సాల్ట్ తో శుభ్రం చేసి పసుపు , ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగిని పాన్ పపెట్టి దానిలో దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి రంగు మారే వరకు వేయించాలి.

కట్ చేసిన మిర్చి ఉల్లిపాయలు వేసి సన్నని మంట మీదే అలాగే ఉంచండి. దానిలో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పది నిముషాలు పొయ్యి మీదే ఉంచండి.

ఆ తర్వాత కడిగిన పసుపు పట్టించిన చేప ముక్కలు తీసుకుని దానిలో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి అలా వదిలేయండి.

ఇక ఇప్పుడు అన్ని రకాల మసాలా పొడులను ఈ మిశ్రమంలో వేసి మూత పెట్టాలి. ముక్కలకు ఉడికిన తర్వాత పెరుగు కొద్దిగా వేసి గరిటెతో తిప్పాలి. గ్రేవీ అయ్యాక దించే ముందు కొత్తిమీర వేస్తె రుచిగా ఉంటుంది. అంతే, వేడి వేడి ఫిష్ కుర్మా రెడీ.