స్టీల్ గిన్నెలు మాడిపోయాయా.? ఇలా క్లీన్ చేస్తే చాలు తళతళా మెరిసిపోతాయంతే.!

Updated on: Mar 04, 2024 | 1:00 PM

ఇప్పుడందరూ కూడా స్టీల్ గిన్నెల్లోనే వంటలు వండుతున్నారు. అయితే వీటిని కొద్దిగా ఎక్కువ వాడితే చాలు.. మెరుపు పోయి.. నల్లగా మారిపోతున్నాయి. ఇక ఆ స్టీల్ పాత్రలకు మళ్లీ మెరుపు తీసుకురావాలంటే..

1 / 5
ఇప్పుడందరూ కూడా స్టీల్ గిన్నెల్లోనే వంటలు వండుతున్నారు. అయితే వీటిని కొద్దిగా ఎక్కువ వాడితే చాలు.. మెరుపు పోయి.. నల్లగా మారిపోతున్నాయి. ఇక ఆ స్టీల్ పాత్రలకు మళ్లీ మెరుపు తీసుకురావాలంటే.. నానా తంటాలుపడాలి. మరి ఈ స్టీల్ గిన్నెలకు మెరుపు ఎప్పటికీ పోకుండా.. మునపటిలానే ఉండాలంటే.. ఏం చెయ్యాలి..

2 / 5
నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఎక్కువ. ఇందులో ఉండే సిట్రస్ మొండి మరకలు, నూనె జిడ్డును తొలగించడానికి సహాపడుతుంది. గిన్నెలో బాగా నల్లబడిన చోట కాస్త నిమ్మరసం వేసి.. కొంచెం సేపు ఉంచి.. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేయండి చాలు.

3 / 5
మొండి మరకలను పోగొట్టేందుకు బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఓ గిన్నెలో కాసింత నీరు పోసి.. దానిలో బేకింగ్ సోడా వేసి.. వాటిని వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నీరు చల్లారేక.. మొండి మరకలు ఉన్న చోట వేసి క్లీన్ చేస్తే చాలు..

4 / 5
తుప్పు మరకలకు బేకింగ్ సోడానే బెటర్ ఆప్షన్. మీరు చేయాల్సిందల్లా ఓ బకెట్ నీటిలో బేకింగ్ సోడా వేసి.. బాగా కలపండి. ఆ తర్వాత ఆ నీటిలో తుప్పు మరకలు ఉన్న పాత్రలను కొద్దిసేపు నానబెట్టండి. అనంతరం వాటిని క్లీన్ చేస్తే మరకలు పోతాయి.

5 / 5
మీరు మరకబట్టిన స్టీల్ పాత్రలో మరిగిన నీళ్లు పోసి కాసేపు ఉంచండి. ఆ తర్వాత నీరు చల్లారాక.. వాటిని క్లీన్ చేయండి.. దెబ్బకు మరకలన్నీ మాయం అవుతాయి.