
భూటాన్: భారతదేశానికి అత్యంత దగ్గరగా ఉన్న పొరుగు దేశం భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. అయితే మీ పర్యటన 14 రోజులలోపు ఉంటేనే, ఇక్కడ సందర్శించడానికి వీసా అవసరం లేదు.

ఫిజీ: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, ఆస్ట్రేలియాకు ఈశాన్య దిశగా ఉన్న ఒక ద్వీప దేశం ఫిజీ. ఈ దేశంలో మీరు వీసా లేకుండా 120 రోజుల వరకు ఉండగలరు.

జమైకా: భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే మరో దేశం జమైకా. మీరు పర్వతాలలో, బీచ్‌లో అందమైన క్షణాలను గడపాలనుకుంటే తప్పక సందర్శించాల్సిన దేశం జమైకా.

నేపాల్: భారతీయులకు వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని నేపాల్ కూడా కల్పిస్తోంది. ఈ దేశంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన పర్వత ప్రకృతి దృశ్యాలను, నేపాలీయుల కళాత్మక నిర్మాణాలను కూడా మీరు వీక్షించవచ్చు.

కజకిస్తాన్: ఈ దేశం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కానప్పటికీ, చారిత్రక ప్రదేశాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప సందర్శనాత్మక ప్రదేశం. మీరు వీసా లేకుండా 14 రోజుల వరకు కజకిస్తాన్‌లో ప్రయాణించవచ్చు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో: ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వీప దేశం పర్యాటకుల యాత్రకు గొప్ప గమ్యస్థానం. మీరు వీసా లేకుండా 90 రోజుల వరకు నెవిల్లేను సందర్శించవచ్చు. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేమికులకు ఇది అద్భుతమైన పర్యాటక ప్రదేశం.