ఒక్క చుక్క నూనె లేకుండా చికెన్ కూర.. డైట్‌లో ఉన్నవారికి బెస్ట్.. అదిరిపోయే రుచి!

Updated on: Jun 18, 2026 | 4:33 PM

మనం చికెన్ కర్రీని ఎప్పుడూ ఆయిల్ తోనే చేస్తాము. అయితే, దీనిని నూనె లేకుండా కూడా చేయొచ్చు. మళ్ళీ ఇది అదిరిపోయే రుచిగా ఉంటుంది. డైట్ ఫాలో అయేవాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్. మరి, లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

నూనె లేకుండా చికెన్ కూరకు కావాల్సిన పదార్థాలు: అర కేజీ చికెన్, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,   అర టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు,  నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, సరిపడా నీరును తీసుకోవాలి.

2 / 5
నూనె లేకుండా చికెన్ కూర తయారి విధానం : ముందుగా చికెన్‌ను తీసుకుని బాగా కడిగి పక్కన  ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మందపాటి గిన్నె తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి ఒక  గ్లాస్ నీళ్ళు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.  ఇంకా దీనిలో  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం కలపాలి.

3 / 5

ఇంకా దీనిలో టమాటా ముక్కలు వేసి  మెత్తబడే వరకు  వీటిని బాగా ఉడికించాలి.  ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,  రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి.  అలాగే చికెన్ కూడా వేసి మసాలా ముక్కలకు పట్టేలా 10 నిమిషాలు కలుపుతూ బాగా ఉడికించాలి.

4 / 5
చికెన్ నుంచి వచ్చే నీరు టమాటా రసం, ఉల్లిపాయ నుంచి వచ్చే వచ్చే సహజ రసాలతోనే కూరను ఎక్కువ సేపు ఉడికించాలి.  దీనిలో అవసరమైతే ఇంకా నీరు కూడా పోసి మూతపెట్టి మధ్య మీడియం మంటపై 30 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. చివర్లో గరం మసాలా కూడా వేసి ఇంకో 5 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. దీనితో పాటు కొత్తిమీర  కూడా చల్లి దీనిని దింపేయాలి.

5 / 5
అన్నం, చపాతీల్లోకి సూపర్ : నూనె లేకుండా చికెన్ కూర చేస్తున్నాం కాబట్టి కూర మరింత రుచిగా ఉండాలంటే దీనిలో 4 టేబుల్ స్పూన్ల పెరుగు లేదా కొద్దిగా కొబ్బరి పాలు కూడా కలపవచ్చు.  నూనె ఒక్క చుక్క లేకపోయినా ఈ చికెన్ కూర చాలా టేస్టీగా  ఉంటుంది.  మీరు ఈ కూరను వేడి వేడి అన్నం, రొట్టెల్లో, చపాతిల్లో తింటే  చాలా బాగుంటుంది.

Follow Us