Nipah Virus: నిపా వైరస్ సోకితే 48 గంటల్లోనే కోమాలోకి.. మొదట లక్షణాలు ఎలా ఉంటాయంటే..

|

Jul 22, 2024 | 3:37 PM

కోవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. నిఫా వైరస్‌లో రోగి వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా అసిమ్టమాటిక్‌గా ఉంటుందని.. తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 5
కేరళను నిఫా వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. మల్లాపురం జిల్లాలో నిఫా వైరస్‌ సోకి 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వైరస్‌ సోకిన గంటల్లోనే ఆ బాలుడు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. బాలుడి కుటుంబాన్ని ఐసోలేషన్‌కు తరలించారు. నిఫా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అధికారులు కోజికోడ్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.  ఈనెల 24 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాండిక్కాడ్ నగరానికి చెందిన బాలుడు ఆదివారం ఉదయం 10:50 గంటలకు గుండెపోటుతో బాధపడ్డాడని.. ఆ తర్వాత మరణించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మరో నలుగురికి నిఫా వైరస్‌ నిర్ధారణ యిందని..  మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.  కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ ఇన్ఫెక్షన్ మృతి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 'మల్టీ-మెంబర్ జాయింట్ అవుట్‌బ్రేక్ రెస్పాన్స్ టీమ్'ని మోహరించింది.. అంటువ్యాధికి వైరస్ సంబంధాన్ని గుర్తించడమే కాకుండా, కేంద్ర బృందం సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది. చివరిసారిగా 2023లో కోజికోడ్ జిల్లాలో ఈ వైరల్ వ్యాప్తి కనిపించింది. అప్పుడు కూడా పలువురు మరణించారు.. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది.

2 / 5
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిపా వైరస్ చరిత్రను పరిశీలించినట్లయితే.. మలేషియాలో పందుల పెంపకందారులలో మొదటిసారిగా 1999లో అంటువ్యాధి నిపా వైరస్ ను గుర్తించారు. అయితే, ఆ తర్వాత మలేషియాలో కొత్త వ్యాప్తి లేదు. 2001లో బంగ్లాదేశ్‌లో అంటువ్యాధి కేసులు నమోదయ్యాయి.. అప్పటి నుండి దాదాపు ప్రతి సంవత్సరం ఆ దేశంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ వ్యాధి తూర్పు భారతదేశంలో కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. కంబోడియా, ఘనా, ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌తో సహా అనేక దేశాలలో వైరస్ (ప్టెరోపస్ బ్యాట్ జాతులు), అనేక ఇతర గబ్బిలాల వాహకాలు కనుగొనబడినందున అనేక ఇతర ప్రాంతాలు కూడా సంక్రమణ ప్రమాదంలో ఉండవచ్చు. నిపా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే  గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. వీటి ద్వారా వైరస్‌ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుంది.

3 / 5
మానవులలో నిపా వైరస్ లక్షణాలు:  WHO ప్రకారం.. నిపా వైరస్ మానవులలో తేలికపాటి ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణకు కారణమవుతుంది. అనేక సందర్భాల్లో మెదడువాపు వ్యాధి ప్రాణాంతక స్థాయికి చేరుకుంటుంది. వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. దీని తరువాత, మైకము, మగత, స్పృహ లేకపోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ను సూచించే నరాల లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది వ్యక్తులు వైవిధ్యమైన న్యుమోనియా, తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలను కూడా అభివృద్ధి చేయవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, ఎన్సెఫాలిటిస్, మూర్ఛలు సంభవిస్తాయి. 24 నుంచి 48 గంటల్లో కోమాకు చేరుకుంటారు.. ఇలా తీవ్రమైన లక్షణాల అనంతరం చనిపోయే ప్రమాదం ఉంది..

4 / 5
కోవిడ్ మరణాల రేటు 2 నుండి 3 శాతం ఉండగా, నిఫా మరణాల రేటు 40 నుండి 70 శాతం వరకు ఉంది..  కేరళలో నిపా వైరస్​ వ్యాప్తిచెందడం.. 2018 నుంచి ఇది నాలుగోసారి. కేరళలోని ఒక్క కొజికోడ్​ జిల్లాలోనే నిపా వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది..దీంతో అక్కడ కొవిడ్​ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. కర్నాటక, తమిళనాడు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. దీంతోపాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

5 / 5
నిఫా వైరస్‌లో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకుండా  అసిమ్టమాటిక్‌గా ఉంటుందని.. తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిపా వైరస్‌కు కచ్చితమైన వైద్యమంటూ ఏమీలేదు. ఇప్పటివరకు అనుమతి పొందిన ఏ ఔషధమూ అందుబాటులోకి రాలేదు. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి తగినంత నీరు అందించడం.. రోగి లక్షణాలకు చికిత్స చేయడం వంటివి మాత్రమే చేస్తారు.