
2026 కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ఘన స్వాగతం పలికింది. ఆదేశంలోని అతిపెద్ద నగరంమైన ఆక్లాండ్ నూతన సంవ్సరానికి అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికింది.

నగరంలోని స్కై టవర్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలకు కౌంట్‌డౌన్ పెట్టి 2026కు వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా వేలకొద్దీ బాణసంచా పేల్చారు. అయితే ఈ దేశంలోని ఉత్తర ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా వేడుకలు రద్దయ్యాయి.

న్యూజిలాండ్‌లోనే ఎత్తైన స్కై టవర్ నుండి 3,500 బాణసంచా ప్రదర్శనతో ప్రారంభమైన ఈ వేడుకలు నగరంలో పెద్ద ఎత్తున సందడిని తీసుకొచ్చాయి.

అయితే మన భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 సాయంత్రం 3:45 గంటలకే కిరిబాటిలోని కొన్ని దీవులు, న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

న్యూజిలాండ్ దేశంలోని సమోవా, టోంగా వంటి పసిఫిక్ దేశాలు నూతన సంవత్సరానికి తొలుత స్వాగతం పలుకుతాయి. ఇక్కడ జరిగే వేడుకలతోనే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు మొదలవుతాయి.