స్మార్ట్ రేషన్ కార్డులకు కౌంట్‌డౌన్ : ఈ ఒక్క పని చేయకపోతే కార్డు అందదు!

Edited By:

Updated on: Jul 27, 2026 | 4:53 PM

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారుల కోసం అత్యాధునిక స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు పాత రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ ఫీచర్లతో కూడిన కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్తికాగా, జిల్లాల వారీగా వాటి పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది.

1 / 5
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2 / 5
క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో రేషన్ కార్డు వివరాలను క్షణాల్లో ధృవీకరించే వీలుంటుంది. భవిష్యత్తులో సంక్షేమ పథకాల సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు కూడా ఈ కార్డులు ఉపయోగపడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల మంది లబ్ధిదారులు ఈ కొత్త కార్డులు పొందనున్నారు.అయితే ఈ కార్డు అందుకోవాలంటే ముందుగా ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో జూలై 31లోపు వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

3 / 5
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక బృందాలు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేస్తున్నాయి. అలాగే రేషన్ దుకాణాలు, ప్రత్యేక శిబిరాల్లో కూడా ఈ-కేవైసీ సేవలు అందుబాటులో ఉంచారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే సమీపంలోని రేషన్ దుకాణంలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం స్వగ్రామానికి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

4 / 5
ఈ-కేవైసీ ద్వారా రేషన్ కార్డుల డేటాబేస్‌ను కూడా ప్రభుత్వం శుద్ధి చేయనుంది. మరణించిన వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. బయోమెట్రిక్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆధార్ కేంద్రాల్లో వేలిముద్రలు లేదా ఐరిస్ వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు.

5 / 5
5 ఏళ్లలోపు పిల్లలకు ఈ-కేవైసీ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ, 8 సంవత్సరాలు దాటిన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసే అవకాశముండటంతో, గడువు ముగిసేలోపు నమోదు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us