
ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు నమిలి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు వృద్ధి చెందుతుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో క్యాలరీలు కూడా కరుగుతాయి. ఇలా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఇలా వేపాకులను నమిలి తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది. సీజనల్ వ్యాధులు ఎటాక్ రక్షిస్తుంది.

వేప ఆకులతో తయారు చేసిన కషాయం దగ్గు, గొంతునొప్పి నివారిణిగా పనిచేస్తుంది. జలుబు వలనే దగ్గు వస్తుంది. కప్పు వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, శొంఠి వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే జలుబు వెంటనే తగ్గుతుంది.

ఇక తలనొప్పి వచ్చిదంటే చాలు.. తల భారంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న విసుగుగా ఉంటుంది. చాలామందికి కళ్లు తిరుగుతాయి. అలాంటప్పుడు కొన్ని వేపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్ని నుదిటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత శుభ్రం చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాకాకుంటే వేపాకులతో కషాయం తయారుచేసి తీసుకోవచ్చు.

ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వేప ఆకుతో వాటిని తరిమికొట్టొచ్చు. ఇందుకోసం కొన్ని వేపాకులను నీళ్లల్లో మరిగించి ఆ నీటిని ఇంట్లో చల్లుకోవాలి. ఇలా చేస్తే దోమలు రావు. అలానే దోమలు కుట్టినప్పుడు చర్మం కందినట్లుగా మారుతుంది.అలాంటప్పుడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది

వేప ఆకుల్ని రాత్రి పూట నీళ్లలో వేసి, ఉదయం ఆ నీళ్లను తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వేప ఆకుల్ని ఎండలో ఆరబెట్టుకుని వాటి పొడిని, తేనెతో కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లాగా అప్లై చేసుకుంటే ముఖచర్మం కాంతివంతంగా మారుతుంది. దీని వల్ల ముఖంమీద ఉన్న మొటిమలు, మచ్చలు మాయమౌతాయి.