
రోజ్ వాటర్ ఒక అద్భుతమైన రెమిడీ. ఇది అద్భుతమైన వాసన మాత్రమే కాకుండా చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. కాటన్ ప్యాడ్ తీసుకుని రోజ్ వాటర్ తో కళ్ల చుట్టూ సార్లు మర్దన చేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయండి.

టీ బ్యాగ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే, ఇందులో ఉండే బ్యాక్టీరియాతో పోరాడే క్యాటెచిన్స్ మొటిమల మచ్చలను తొలగిస్తుంది. టీ బ్యాగ్‌లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరొక పదార్ధం కీర దోసకాయ. కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించేందుకు దోసకాయ ఉత్తమమైనది. దోసకాయ ముక్కలు లేదా తురుము కనురెప్పల మీద పది నిమిషాల పాటు ఉంచండి. దీన్ని రోజుకు ఎన్ని సార్లు రిపీట్ చేసిన కూడా పర్వాలేదు.. కళ్ల చుట్టూ ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

బంగాళాదుంపలలోని అజిలైక్ యాసిడ్ సమ్మేళనం నల్ల మచ్చలను తగ్గించడానికి, ముఖంపై మచ్చలను తొలగించడానికి, హైపర్పిగ్మెంటేషన్ క్రమంగా ఫేడ్ చేయడానికి సహాయపడుతుంది. బంగాళాదుంప రసాన్ని కళ్ల చుట్టూ రాసి మసాజ్ చేయడం వల్ల చర్మం మరింత సున్నితంగా మారుతుంది. నల్లటి మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.