1 / 5
మెడ చుట్టూ ఏర్పడిన నలుపుదనాన్ని పోగొట్టడంలో టమాటా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా టమటా రసం, కొన్ని చుక్కల నిమ్మరసం, కాస్త తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఫలితంగా స్కిన్‌కి మంచి పోషణ లభిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.