
అసిడిటీ, గ్యాస్ట్రిక్ , ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బండే వారి సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు చాలా మంది అజీర్తితో ఇబ్బంది పడుతున్నారు కూడా.. దీంతో చాలా మంది యాంటాసిడ్ లను తీసుకుంటున్నారు. అయితే ఇవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం బారిన పడవచ్చు. గ్యాస్-గుండె మంట సమస్యను నివారించడానికి ఈ డ్రింక్ తాగితే 5 నిమిషాల్లో గ్యాస్ తగ్గుతుంది.

దాదాపు రోజు గ్యాస్ , ఉబ్బరం, మంటతో బాధపడుతుంటే.. ఈ బాధను భరించడం కష్టం. అంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం అస్సలు బాగోలేదని.. లేదని అర్ధం. గ్యాస్ , గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారం, పానీయాలపై అవగాహన పెంచుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. వ్యాయామం చేయాలి.

గ్యాస్ , గుండెల్లో మంట సమస్యను నివారించడానికి సరైన సమయంలో తినడం, త్రాగడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉంటే పిత్త మొత్తం పెరుగుతుంది. ఇది కడుపు, యాసిడ్ రిఫ్లక్స్‌లో హానికరమైన పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది.

అస్తామని తేనుపులు వస్తుంటే ఆహారం సరిగా జీర్ణం కాలేదని అర్థం. ఛాతీ , గొంతు మంట సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే చాలా మంది అజీర్తిని నివారించడానికి కొన్ని సార్లు యాంటాసిడ్‌లను తీసుకుంటారు. అయితే అది ప్రతికూలంగా ఉండవచ్చు. గ్యాస్-గుండె మంట సమస్యను నివారించడానికి ఇంటి చిట్కాలు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి.

యాంటాసిడ్‌లు గ్యాస్ నుంచి తక్షణమే ఉపశమనం ఇచ్చినట్లే.. ఇంటిలో తయారు చేసిన పానీయం కూడా రిలీఫ్ ఇస్తుంది. ఈ పానీయాన్ని కేవలం 3 పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. సోంపు, యాలకులు, జీలకర్ర చాలు.

ఒక గ్లాసు నీటిలో 4 చిన్న ఏలకులు, 1 టీస్పూన్ సోపు, జీలకర్ర కలపండి. మిశ్రమాన్ని అధిక వేడి మీద మరిగించండి. నీరు మరిగేటప్పుడు.. మంటను తగ్గించి కొంచెం సేపు మరిగించండి. తర్వాత గ్యాస్‌ను ఆపివేసి నీటిని వడకట్టండి

గ్యాస్-గుండెల్లో మంటతో ఇబ్బంది పడుతుంటే లేదా రెస్టారెంట్ లో తిన్న రోజున ఈ పానీయం తాగవచ్చు. ఈ పానీయం గ్యాస్‌ను తగ్గిస్తుంది, 5 నిమిషాల్లో త్రేనుపు ఆపుతుంది. ఈ డ్రింక్‌ని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.