
ప్రధానమంత్రి మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన బాల్యం అత్యంత పేదరికంలో గడిచింది. ఆయన తండ్రి దామోదర్‌దాస్ ముల్చంద్ మోడీతో కలిసి వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మేవారు. ఆయన తల్లి హీరాబెన్ ఒక సాధారణ గృహిణి. ఆరుగురు తోబుట్టువుల్లో మూడవ సంతానం ప్రధాని మోడీ. రేపు ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రధానమంత్రి మోడీ చిన్నప్పటి నుంచి చాలా ఆశయంతో ఉండేవారని.. దేశానికి ఏదైనా సేవ చేయాలనే కల కనే వారని మోడీ పాఠశాల స్నేహితులు చెబుతున్నారు. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. పాఠశాలలో చర్చా పోటీల్లో పాల్గొనేవారు. స్థానిక లైబ్రరీలో గంటల తరబడి చదువుతూ గడిపేవారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం కూడా ఇష్టం.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా ప్రధానమంత్రి ప్రజాదరణ పెరిగింది. ఈ ఏడాది జూలైలో విడుదలైన ఆమోద రేటింగ్ జాబితాలో డెమోక్రటిక్ నాయకుడు అగ్రస్థానంలో నిలిచారు. గత 11 సంవత్సరాలలో ప్రధానమంత్రి మోడీ అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశాన్ని సగర్వంగా నిలబెట్టారు.

నరేంద్ర మోడీ జీవిత కథ.. పోరాటం, అంకితభావం స్ఫూర్తిదాయకమైన గాథ అని చెప్పవచ్చు. ఆయన తన అసాధారణ నాయకత్వం, గొప్ప వ్యక్తిత్వంతో భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేసిన నాయకుడు. ఆయన నాయకత్వ సామర్థ్యం, దార్శనికత ,ప్రజా మద్దతు ఆయనను ప్రభావవంతమైన నాయకుడిగా మార్చాయి. తన నిర్ణయాలకు కట్టుబడి ఉండి.. తన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేసే బలమైన నాయకుడు. ఆయన నాయకత్వ సామర్థ్యం ఆయన్ని మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా నిలబెట్టింది

ప్రధానమంత్రి భారతదేశ భవిష్యత్తు గురించి శ్రద్ధ వహించే దార్శనిక నాయకుడు. ఆయన అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో స్వచ్ఛ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా , మేక్ ఇన్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. ఇవి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి సహాయపడుతున్నాడు.

ప్రజల నుంచి లభిస్తున్న విస్తృత మద్దతు, ప్రజాదరణ, ఆయన వ్యక్తిత్వ అఖండ ప్రభావం ఆయనను దృఢ సంకల్పం కలిగిన నాయకుడిగా మార్చాయి. కష్టమైన నిర్ణయాలను కూడా సులభంగా అమలు చేయగల నేర్పరి తనం ఆయన సొంతం. నరేంద్ర మోడీ నాయకత్వ సామర్థ్యం, దార్శనికత .. ప్రజా మద్దతు ఫలితంగానే అని చెప్పవచ్చు. ఆయన తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తన ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాల్ ను ఆయన అధిగమించారు. ఈ లక్షణం మోడీ దృఢ సంకల్పానికి అద్దంగా నిలుస్తుంది.

చిన్న వయసులోనే ఇంటిని వదిలి ప్రజా జీవితంలోకి ప్రవేశించిన నరేంద్ర మోడీ తన జీవితాంతం నిస్వార్ధంగా దేశ సేవలోనే గడిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా అగ్రస్థానంలో ఉన్న మన దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా అనేక సంస్కరణలు చేపట్టారు. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని అగ్ర నాయకులు కూడా మోడీ నాయకత్వాన్ని ప్రశంసల వర్షంతో నింపేస్తున్న సంగతి తెలిసిందే.