
చాలా మంది ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాధించాలని అనుకుంటారు. అలాంటి వారికి పుట్టగొడుగుల పెంపకం మంచి ఎంపిక. ఈ ప్రత్యేక వ్యవసాయాన్ని ఇంట్లోనే సులభంగా ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే చేయగలిగే మంచి వ్యాపారం ఇది. దీని నుండి మీరు నెలకు రూ.80,000 వరకు సంపాదించవచ్చు.

పుట్టగొడుగుల పెంపకానికి స్థలం కూడా పెద్దగా అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని 300-400 చదరపు అడుగుల స్థలంలో కూడా ప్రారంభించవచ్చు. వీటి పెంపకం గురించి ఉచిత శిక్షణ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుండి ఈ వ్యాపారానికి సహాయం, ప్రభుత్వ రుణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సరైన విత్తనాలు, సాగు, నిర్వహణ మీకు తెలిస్తే, మీరు ఎక్కువ లాభం పొందుతారు.

ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి నుండే చేయగలిగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. వాటిలో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ వ్యాపారాన్ని రూ.10,000 పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ.60,000 నుండి రూ.80,000 వరకు సంపాదించవచ్చు.

పుట్టగొడుగుల పెంపకంలో ఆయిస్టర్, మిల్క్ మష్రూమ్ వంటి రకాలు ఉన్నాయి. వీటికి ఇళ్ళు, హోటళ్ళు, మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఒక కిలో పుట్టగొడుగు ధర రూ. 200 వరకు పలుకుతుంది. ఒక చిన్న పొలం రోజుకు 15-20 కిలోల వరకు ఉత్పత్తి చేయగలదు. అంటే మీరు రోజుకు రూ. 3వేల నుంచి 4,వేలు, నెలకు రూ. 70 వేల నుంచి 80 వేల వరకు సంపాదించవచ్చు.

వీటి పెపకం మొదట్లో శిలీంధ్ర దాడి, విత్తన నాణ్యత తగ్గడం వంటి కొన్ని సమస్యలు రావచ్చు. కానీ మీరు వీటి పెంపకంలో సరైన విధానాన్ని నేర్చుకుంటే, ఈ వ్యాపారం ఎప్పటికీ మిమ్మల్ని నిరాశపరచదు. చాలామంది దీని గురించి శిక్షణ పొంది తమ సొంత తోటలను నడుపుతున్నారు, అలాగే వాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. మీరుకూడా ఈ వ్యాపారం చేయాలనుకుంటే.. మీ దగ్గర్లో ఉన్న శిక్షణ కేంద్రాలను సంప్రదించండి.