దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. అంబానీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖేష్ అంబానీ 15 కిలోల వరకు తగ్గారు. ఆయన బరువు తగ్గేందుకు ఎలాంటి కసరత్తు చేశారు? ఎలాంటి ఆహార నిమమాలు పాటించారో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ముఖేష్ అంబానీ కొన్ని విషయాలను అనుసరించడం ద్వారా తన బరువును తగ్గించుకున్నారు. ముఖేష్ అంబానీ రోజూ ఉదయం 5.30 గంటలకు నిద్రలేచి గంటపాటు వేగంగా నడుచుకుంటూ వెళతారు.
వారు ఇతర వ్యాయామాలు చేయరు. శాకాహార భోజనంలో కూడా వీలైనన్ని ఎక్కువ సలాడ్ తినడంపైనే దృష్టి పెడతారట అంబానీ. అంతే కాకుండా ఆహారంలో జ్యూస్ కూడా తీసుకుంటారు.
Mukesh Ambaముఖేష్ అంబానీ రోజువారీ భోజనంలో గుజరాతీ వంటకాలు ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖేష్ అంబానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిన్నర్‌కు దూరంగా ఉండరట. అతను తన కుటుంబం మొత్తంతో కలిసి రాత్రి భోజనం చేస్తారు.n
వీలైనన్ని ఎక్కువ ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం, ఉదయం వాకింగ్ చేయడం ద్వారా ముఖేష్ అంబానీ 15 కిలోల వరకు తగ్గారు. అంబానీ ఎంత బిజీగా ఉన్నా రోజూ ఉదయం వాకింగ్ చేయడం మర్చిపోరట.