నోటి పూతల వల్ల పుండ్లు వస్తుంటాయి. ఇది జ్వరం, హార్మోన్ల అసమతుల్యతత, మలబద్ధకం వంటి కారణాలతో సాధారణంగా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, జింక్ మొదలైన పోషకాలు లోపిస్తే నోటిలో పుండ్లు వస్తాయి. చాలా మంది సక్రమంగాలేని దంతాల కారణంగా బ్రేస్‌లు ధరించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కూడా పుండ్లు వచ్చే ప్రమాదం ఉంది.