
Monsoon Session of Parliament: పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది.

ఈ మేరకు జూలై 20 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ప్రకటించారు.

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియనున్నాయి.

అయితే ఈ వర్షాకాలపు సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు మరో బిల్లును ప్రవేశపెట్టవచ్చు, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు వంటి పలు కీలక బిల్లులను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వముంది.

ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించిన నూతన పార్లమెంట్ భవనంలో జరిగే ప్రప్రథమ సమావేశాలు ఇవే కావడం విశేషం.