
కూనూర్ (Coonoor).. నీలగిరి పర్వతాల మధ్య ఉన్న కూనూర్.. ఊటీతో పోలిస్తే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. చుట్టూ ఉండే టీ తోటలు, పర్వతాలు, నీలి రైలు దృశ్యాలు వర్షాకాలంలో ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ సిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ లాంటి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.

వాల్పరై (Valparai).. కేరళ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వాల్పరై.. ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి ఒక మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. అలియార్ డ్యామ్, మంకీ ఫాల్స్ లాంటి ప్రదేశాలను ఈ వర్షాకాలంలో చూడటం ఒక ప్రత్యేకమైన ఆనందం.

యెర్కాడ్ (Yercaud).. సేలం జిల్లాలోని యెర్కాడ్.. జనసంచారం తక్కువగా ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉన్న బోటింగ్ సరస్సు, పగోడా పాయింట్, క్లియూర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు చిన్న కుటుంబ ట్రిప్స్‌కు సరైనవి.

కొల్లిమలై (Kolli Hills).. తంజావూరు, తిరుచ్చి నుండి సులభంగా చేరుకునే కొల్లిమలై.. ప్రకృతి అందాలు, సాహసం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న అకాయ గంగై జలపాతాలు (Akaya Gangai Waterfalls) తప్పక చూడాలి.

జవధు కొండలు (Javadi Hills).. తిరువణ్ణామలై దగ్గర ఉన్న జవధు కొండలు.. నగర జీవితానికి అలసిపోయిన వారికి ఒక రోజు ట్రిప్‌కు సరైన ఎంపిక. ఇక్కడ ఉన్న భీమ జలపాతాలు, అడవులు, సరస్సులు ఒక రోజు పర్యటనను చాలా ప్రత్యేకంగా మారుస్తాయి.

మెట్టుపాలయం (Mettupalayam).. ఊటీకి వెళ్లే మార్గంలో ఉండే మెట్టుపాలయం.. చాలా మందికి తెలియని ప్రశాంతమైన ప్రదేశం. ఊటీలోని రద్దీని కాకుండా ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు మెట్టుపాలయాన్ని తప్పక చూడాలి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది.