తడి జుట్టు దువ్వడం అనేది అతి పెద్ద తప్పు. జుట్టు మూలాలు వదులుగా మారి దెబ్బతింటాయి. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక కారణం. వర్షంలో తడిస్తే ముందుగా జుట్టును ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత జుట్టును దువ్వేందుకు ప్రయత్నించాలి. వర్షాకాలంలో గాలిలో వివిధ బ్యాక్టీరియా, క్రిములు, వైరస్‌లు, ధూళి కణాలు ఉంటాయి. ఇవి జుట్టులో చేరితే తల దురద, పొడిగా మారుతుంది. జుట్టులోని మురికి, అదనపు నూనె, సూక్ష్మక్రిములను తొలగించడానికి కనీసం వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలి.